రెడ్డిగూడెం మండలం కొత్త నాగులూరు గ్రామంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. పొలాల మెరక పేరుతో అనుమతులు తీసుకుని ఇటుక బట్టీలకు పబ్లిక్గా మట్టి తరలిస్తూ రూ. లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. పర్యావరణ సమతుల్యం గురించి ఆలోచించకుండా అధికారులు అనుమతులు ఎలా ఇస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ అధికారులు ఇటుక బట్టిలకు మట్టి తరలించేందుకు అనుమతులు లేవన్నారు.