కొండపల్లి గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలొ టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సభ్యత్వ నమోదు అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి జంపాల సీతారామయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొండపల్లి మున్సిపాలిటీలో నగడపగడపకు వెళ్లి తెలుగుదేశం పార్టీ సభ్యత్వంను నమోదు చేయవలసిందిగా, ప్రతి ఒక్కరికి సభ్యత్వం ప్రాముఖ్యత తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.