మైలవరం నియోజకవర్గ పరిధిలోని గొల్లపూడి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని ఈవీఎంలను భద్రపరిచిన జిల్లా ఎలక్షన్ గోదామును శుక్రవారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సాధారణ తనిఖీలలో భాగంగా పరిశీలించారు. గోడౌన్ కు వేసిన సీల్డ్ లను, ఈవీఎంల రక్షణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను, సిసి కెమెరాల నిఘాను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్ లో సంతకం చేశారు.