వేసవి సెలవుల అనంతరం మైలవరం నియోజకవర్గంలోని పాఠశాలలు నేడు పునఃప్రారంభం కానున్నాయి. మైలవరం పట్టణంలోని పాఠశాలల తల్లిదండ్రులు, పిల్లలతో సందడిగా మారాయి. ఉపాధ్యాయులు ఇంటింటికీ ప్రచారం చేసి, ఉచిత సౌకర్యాలను వివరించారు. విద్యార్థులు నూతన ఉత్సాహంతో చదువుకు సిద్ధమయ్యి బడి బాట పట్టారు.