ప్రతిక్షణం ప్రజలకు మంచి చేసేందుకు పనిచేస్తున్నామని ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. శనివారం ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం పరిటాలలో జిల్లా స్థాయి పల్లె పండుగ కార్యక్రమం, గోకులం షెడ్లు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలను జిల్లా, ఇన్ ఛార్జ్ మంత్రి సత్య కుమార్ యాదవ్ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ కలెక్టర్ లక్ష్మీషా, కూటమి నేతలు, అధికారులతో కలిసి చేశారు.