రెడ్డిగూడెం మండలం కొత్త నాగులూరు గ్రామంలో బాబు జగ్జీవన్రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. గ్రామ వైసిపి పార్టీ ఎస్సీ సెల్ నాయకులు మట్టకొయ్య రాము ఆధ్వర్యంలో నాయకులతో కలిసి జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జగ్జీవన్రామ్ అనగారిన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహానీయుడని, దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు.