ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గుంటుపల్లి గ్రామంలో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న బియ్యం రోడ్డుపాలయ్యాయి. శుక్రవారం గుంటుపల్లి గ్రామంలో ఇంటింటికి ప్రభుత్వం అందిస్తున్న బియ్యం కుప్పలు కుప్పలుగా రోడ్డుమీదదర్శనమిస్తున్నాయి. తెల్లవారుజామున కురిసిన వర్షాలకు రోడ్డుపై కుప్పలుగా ఉన్న బియ్యం నాని పోయి కనిపిస్తున్నాయి. ఎందుకు కుప్పలుగా బియ్యం ఇక్కడఎందుకు ఉన్నాయని, లేనివారికిఇచ్చినఉపయోగపడతాయనిఅభిప్రాయపడుతున్నారు.