ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో వర్షపు నీరు నిలిచిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షాలకు గాను వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షపు నీరు పోయేందుకు మార్గం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఆ నీటిలో నుండే ద్విచక్ర వాహనదారులు ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు.