రెడ్డిగూడెం: సారాతో పట్టుబడితే ప్రభుత్వ పధకాలు కట్

78చూసినవారు
రెడ్డిగూడెం: సారాతో పట్టుబడితే ప్రభుత్వ పధకాలు కట్
నాటు సారా ముద్దాయిలు మరోసారి సారా జోలికి వెళ్తే ప్రభుత్వ సంక్షేమ పధకాలు నిలుపుదల చేస్తామని రెడ్డిగూడెం తహశీల్దార్ హెచ్చరించారు. మండలంలోని అన్నెరావుపేట తండాకు చెందిన బాణావతు రవి గతంలో సారా కేసులో పట్టుబడటంతో బైండోవర్ కేసు నమోదు అయ్యింది. నిందితుడు మరలా సారా విక్రయిస్తూ దొరకడంతో ఎమ్మార్వో శుక్రవారం రూ. లక్ష జరిమానా విధించారు. నవోదయం 2. 0 కార్యక్రమానికి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్