రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేటలో మంగళవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించినట్లు వివరించారు. గ్రామానికి చెందిన గోపి, భరోత్ చిన్ని అనే వ్యక్తులు బైక్ పై 15 లీటర్ల నాటు సారాను రవాణా చేస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్లు వివరించారు. సారాను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు నమోదు చేసినట్లు వివరించారు. మైలవరం కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ వారికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు వివరించారు.