నవోదయం 2. 0లో భాగంలో నాటుసారాను తుడిచి పెట్టేందుకు ఏర్పడిన రెడ్డిగూడెం మండల కమిటీ సమావేశం తహసీల్దార్ జె. సుశీల అధ్యక్షతన శనివారం జరిగింది. మండలంలో నాటుసారా ప్రభావిత గ్రామాలైన రెడ్డిగూడెం, అన్నేరావుపేట, ఓబుళాపురం, రుద్రవరం, ముచ్చినపల్లి, మద్దులపర్వ గ్రామల కమిటీలు సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు తీర్మానాలు చేశారు. మైలవరం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జె. శ్రీనివాస్, ఎపీడీవో, ఎస్సై మోహనరావు పాల్గొన్నారు.