మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలోని శాంతినగర్ లో కోడిపందాలు ఏర్పాటుకు ఫ్లెక్సీలు వెలిశాయని శనివారం లోకల్ యాప్ లో ప్రచురించిన కథనానికి పోలీసు అధికారులు స్పందించారు. దీనిపై సమాచారం అందుకున్న కొండపల్లి పోలీస్ రెవెన్యూ సిబ్బంది వెంటనే వెళ్లి ఫ్లెక్సీలు తొలగించారు. కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.