మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం కొత్త రెడ్డిగూడెం శివారు గోపాలపురం వద్ద ఎన్ఎస్పి కాలువ ను మైలవరం టిడిపి నాయకుడు రవీందర్ రెడ్డి గురువారం పరిశీలించారు. నాగార్జున సాగర్ జలాలు రెడ్డిగూడెం రావడంతో ఈ ప్రాంత రైతులు హర్షo వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చుక్క నీరు కూడా సాగర్ జలాలు రాలేదని రైతులు విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.