మైలవరం బ్రాంచ్ నుండి సాగర్ జలాలు విడుదల

75చూసినవారు
మైలవరం బ్రాంచ్ నుండి సాగర్ జలాలు విడుదల
మైలవరం బ్రాంచ్ కెనాల్ నుండి చెవుటూరు మేజర్ కెనాల్ కు 100 క్యూసెక్కుల సాగర్ జలాలు శుక్రవారం విడుదల చేశారు. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు మైలవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఇన్ ఛార్జ్ నాగమల్లేశ్వరరావు, నీటి సంఘం అధ్యక్షులు సుధాకర్ రావు, ఎన్ఎస్పీ డీఈ, ఎన్ఎస్పి ఏఈ రైతులు, నీటి సంఘం సభ్యుల సమక్షంలో మైలవరం కెనాల్ నుంచి దిగువ ఉన్న చెవుటూరు మేజర్ కు 100 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్