ఇబ్రహీంపట్నం మండలం చిన్న లంక గ్రామంలో 75 కుటుంబాలు చీకట్లో అలమటిస్తున్నాయి. దారి వెంట విద్యుత్ దీపాలు లేక ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. సోమవారం మంత్రి నారాయణ పర్యటనలో భాగంగా ఆ గ్రామాలలో ఎప్పుడు లేని వెలుగు నెలకొంది. చీకటిగా ఉన్న ప్రాంతంలో మంత్రులు కలెక్టర్లు ఎమ్మెల్యేలు పర్యటించడంతో వాహనాలు వెలుతురు చూసి కొంతసేపు ఆనందం పొందారు. ఇటీవల వరదలకు వీది లైట్లు పోగా, ఇప్పటివరకు పట్టించుకోలేదని తెలిపారు