ఇబ్రహీంపట్నం గురు పౌర్ణమి వేడుకల్లో టిడిపి నేత

54చూసినవారు
ఇబ్రహీంపట్నం గురు పౌర్ణమి వేడుకల్లో టిడిపి నేత
ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్లో వేంచేసిన శ్రీ సద్గురు సాయి బాబా దేవస్థానంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య గురుపౌర్ణమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువునకు సమాజంలో అత్యుత్తమ స్థానం ఇవ్వడం సంప్రదాయమని, గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడిగా పూజించడం ఆనవాయితీగా వస్తోందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్