ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మార్వో ఆఫీస్ ప్రక్కన కాలనీలో రోడ్డుపై రెండు రోజులుగా వర్షపు నీరు ఈ వర్షపు నీరు వెళ్లేందుకు ఎటు అవకాశం లేకపోవడంతో రోడ్డుపై నిలిచి ఉన్న వర్షపు నీటిని స్థానికంగా నివాసముంటున్న మహిళలు ఎత్తి పారపోస్తున్నారు. రాత్రి సమయంలో ఈ నీటి వలన చెడు వాసన వెదజల్లుతూ, దోమలు సంచరిస్తున్నాయని మహిళలు ఆవేదం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వార్డు మెంబర్ కు చెప్పినా ఫలితం లేదని మండిపడ్డారు.