జి కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన రేషన్ డీలర్ గుడిపూడి వెంకటేశ్వరరావును రేషన్ డీలర్ల జి కొండూరు మండల అసోసియేషన్ అధ్యక్షుడిగా శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జి కొండూరు రేషన్ డీలర్ల సమావేశంలో వెంకటేశ్వరావుని ప్రెసిడెంట్ గా సెక్రటరీగా ఐ ఎస్ కె. ప్రసాద్ ని ఎన్నుకున్నారు.రేషన్ డీలర్ల సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లి కమిషన్లు పెంపుకై కృషి చేస్తానన్నారు.