మైలవరం మండలం చంద్రాల గ్రామంలో 2017-18 సంవత్సరంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం అందలేదని స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం బాధితులు ముట్టడించారు. రోడ్డు నిర్మాణం జరిగి 8 సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వాలు, అధికారులు మారిన మాకు న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని అనేకమార్లు రోడ్డెక్కి వినతి అందించినా ఫలితం శూన్యమన్నారు.