భారత స్వతంత్య్ర పోరాటంలో దివంగత నేత వడ్డే ఓబన్న సేవలు చిరస్మరణీయమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. శనివారం ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, వడ్డే ఓబన్న218వ జయంతి సందర్భంగా మైలవరంలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో వసంత వెంకట కృష్ణప్రసాదు ముఖ్యఅతిథిగా పాల్గొని ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.