విజయవాడ: బుడమేరు వరద నుంచి శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం తొలిఅడుగు వేసింది. రూ.28కోట్లు కేటాయించి గండ్లు పడిన చోట అర కిలోమీటర్ మేర రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల్ని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇటీవల ప్రారంభించారు. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయి. మూడు విడతలుగా జరుగుతున్న ఈ పనులను జూన్ 10 నాటికి పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు.