మైలవరం మండల టీడీపీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందోనని పార్టీ నాయకులు, కార్య కర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు ఇప్పటికే (తొమ్మిది) సార్లు వరుసగా కొనసాగడంతో అధిష్ఠానం ఆదేశాలతో కొత్త వ్యక్తిని నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చండ్రుగూడెం, కీర్తి రాయిని గూడెం, మైలవరం, గ్రామాల నుంచి ముగ్గురు నాయకులు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. మైలవరం టౌన్ నుండి ఏకంగా ఆరుగురు పోటీపడుతున్నారు.