చందర్లపాడు పోలీస్ స్టేషన్లో ఏసీపీ ఆకస్మిక తనిఖీలు

85చూసినవారు
చందర్లపాడు పోలీస్ స్టేషన్లో ఏసీపీ ఆకస్మిక తనిఖీలు
చందర్లపాడు పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి ట్రైనింగ్ ఏసీపీ పావని ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్టేషన్లోని సిబ్బంది యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేషన్లోని రికార్డులను పరిశీలించి, స్టేషన్ ఆవరణాన్ని పరిశీలన చేశారు, ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. అదేవిధంగా సీఐ చౌహాన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్