నందిగామ నియోజకవర్గంలో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రతలు నందిగామలో 35, కంచికచర్లలో 37 డిగ్రీలుగా నమోదయ్యాయి. అయితే సాయంత్రం తర్వాత మేఘావృతమై వాతావరణం చల్లబడింది. రాత్రికి వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.