ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల పట్టణంలోని జూనియర్ ఇంటర్మీడియట్ కళాశాలలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఏపీ. విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. అనంతరం విద్యార్థినిలతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.