రహదారి ప్రమాదాలు, అగ్నిప్రమాద ఘటనలు, విషపు గాలుల ప్రభావం వంటి ఘటనలు చోటు చేసుకున్న సమయంలో బాధితులకు మొదటి గంటలో వైద్యం అందిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని ఏపీ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కోరారు. మంగళవారం నాడు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ నందిగామలో కమ్యూనిటీ ఆసుపత్రి లో ట్రామా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని శాసనసభ స్పీకర్ ద్వారా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.