ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల క్వారీ, క్రషర్‌ల వద్ద గురువారం ఉదయం రైతులు నిరసన తెలిపారు. క్వారీల నుంచి వచ్చే దుమ్ము, ధూళి వల్ల తాము పండించిన పంటల దిగుబడులు తగ్గుతున్నాయని రైతులు వాపోయారు. రూ. లక్షల్లో పంట నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.