పేరంటాలమ్మ ఉత్సవాలలో మాజీ మంత్రి దేవినేని

56చూసినవారు
పేరంటాలమ్మ ఉత్సవాలలో మాజీ మంత్రి దేవినేని
నందిగామ మండలం లింగాలపాడులో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పేరంటాల అమ్మవారి తిరుణాళ్ల మహోత్సవాలు గత ఐదు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా శనివారం రాత్రి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నేతలతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరునాళ్లను పురస్కరించుకొని పశు ప్రదర్శన, బండలాగుడు పోటీలు నిర్వహించారు. విజేతలకు దేవినేని బహుమతి ప్రదానం చేశారు.

సంబంధిత పోస్ట్