కంచికచర్ల ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి కుంభవృష్టి కురిసింది. అర్ధరాత్రి 1.30గంటల సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమై 2.15 గంటల వరకు కురిసింది. 81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణ, ఆర్టీసీ బస్టాండు జలమయమయ్యాయి. వరద నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్ని వరద ముంపుకు గురయ్యాయి. ఈ ఏడాదిలో ఈప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదయింది.