కంచికచర్ల: భూమిని అమ్ముకోనివ్వట్లేదంటూ మహిళా రైతు ఆవేదన

60చూసినవారు
తన భూమిని అమ్ము కోనివ్వడం లేదంటూ ఓ మహిళా రైతు శుక్రవారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కంచికచర్ల మండలం పరిటాలకు చెందిన మాధవి మాట్లాడుతూ తనకున్న రెండెకరాల భూమి పక్కనే క్వారీలున్నాయి. క్రషర్ల నుంచి దుమ్ము పడటంతో పంటలు పండటం లేదు. నా భర్తకు ఆరోగ్యం బాగాలేదు. అతడి వైద్య ఖర్చుల కోసం పొలాన్ని అమ్ముకుందామంటే కసర్ల యాజమానులు అడ్డుపడుతున్నారు అని వాపోయింది.

సంబంధిత పోస్ట్