నందిగామ మండలం పల్లగిరి గ్రామ శివారు మూల మలుపు వద్ద పోలీసులకు రాబడిన సమాచారం మేరకు అక్రమంగా రేషన్ రవాణా చేస్తున్న రేషన్ బియ్యం నెంబర్ ప్లేట్ లేని వ్యానును పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నరు.
రేషన్ బియ్యం 50/ కేజీల టిక్కీలు, 10 బస్తాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించారు. వాహన డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.