చందర్లపాడు మండలం పరిధిలో వెంచేసి ఉన్న శ్రీ అలివేలమ్మ తల్లి తిరుణాల మహోత్సవాలు 5 రోజులు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ తిరుణాల మహోత్సవంలో సందడి చేసేందుకు మే 12వ తేదీన చందర్లపాడుకు జబర్దస్త్ టీం వస్తున్నట్లు శనివారం మధ్యాహ్నం ఓ వీడియోలో కెవ్వు కార్తిక్ తెలిపారు. కాగా పట్టణ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, ఈ తిరణాల మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు.