నందిగామ పోలీస్టేషన్ పరిధిలో చెడు నడత కలిగి, వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారందరికీ ఆదివారం స్థానిక ఎస్సై అభిమన్యు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈక్రమంలో వారందరూ ఇకపై ఎటువంటి వివాదాలకు పోకుండా ఉంటామని ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండల పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు తావు లేదని, అటువంటి చర్యలు చేసే వారిపై చట్టరీత్యా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించామన్నారు.