కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం పరిధిలో గురువారం ఫ్లోరోసిస్ కమ్యూనిటీ సర్వే నిర్వహించారు. పరిటాలలోని వాటర్ ప్లాంట్లను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు దంత పరీక్షలు చేశారు. ప్రజలకు వ్యాధి నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్లోరోసిన్ కన్సల్టెంట్ డాక్టర్ బద్రీనాథ్, కంచికచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.