యోగా చేస్తే మంచి ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చని ఎంపీడీవో లక్ష్మీ కుమారి తెలిపారు. సోమవారం కంచికచర్లలో యోగాంధ్రపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్వో వేమూరి మానస, డ్వాక్రా సభ్యులు, అంగన్వాడి టీచర్లు, గ్రామ సచివాలయం సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, జాతీయ ఉపాధి హామీ శ్రామికులు తదితరులు పాల్గొని మండల కేంద్రంలో మానవహారంగా నిలబడి ప్రతిజ్ఞ చేశారు.