ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నీయోజకవర్గం కంచికచర్ల మండలం మొగులూరు గ్రామములో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ భవనాన్ని శనివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో అధికారులు, కూటమి నాయకులు పరిశీలించారు. జనవరి 6 నా స్కూల్ భవనాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించనున్న సందర్భంగా అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు.