కంచికచర్ల మండలం కీసర గ్రామంలో బుధవారం గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గ్రామం సుభిక్షంగా ఉండాలని రైతాంగం, ప్రజానీకం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆ తల్లిని వేడుకున్నట్లు తెలియజేశారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం పొంది తీర్థప్రసాదాలను స్వీకరించారు.