కంచికచర్లలోని పెద్ద బజార్ లో వీధి కుక్కల బెడద అధికంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయని, చిన్నారులను బయటకు పంపించాలంటే భయపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో రహదారిపైకి వస్తే వెంటపడుతున్నాయని భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి రక్షించాలని కోరుతున్నారు.