ఎన్టీఆర్ జిల్లా: కృష్ణాజిల్లా న్యాయ సేవధికారి సంస్థ ఆధ్వర్యంలో డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సంస్థ కార్యదర్శి కె. వి రామకృష్ణయ్య, నందిగామ సీనియర్ సివిల్ జడ్జి సత్యలక్ష్మీ ప్రసన్న, నందిగామ సబ్ జైలు శనివారం విజిట్ చేశారు. ఖైదీల వివరాలు, వారి యోగ క్షేమాలు తెలుసుకొని ఖైదీలకు వారి హక్కులను వివరించి చట్టాలపై అవగాహన కల్పించారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అద్దంకి మణిబాబు పాల్గొన్నారు.