తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి అని తెదేపా కంచికచర్ల టౌన్ పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు పేర్కొన్నారు. గురువారం కంచికచర్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టిడిపి నాయకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి గతంలో రూ. 2 లక్షల ప్రమాద బీమా సదుపాయం ఉండేదని, దానిని ప్రస్తుతం రూ. 5 లక్షలకు పెంచారన్నారు.