కూటమి ప్రభుత్వం ఎడది పాలన హామీలకే పరిమితమై ఆచరణలో పూర్తిగా విఫలమైనదని సీపీఎం ఎన్టీఆర్ జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కోట కళ్యాణ్ విమర్శించారు. మంగళవారం రాత్రి నందిగామ సుందరయ్య భవనంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సిఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనారని విమర్శించారు.