మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. శుక్రవారం నందిగామ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వారి సారధ్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవని నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు దూసుకెళ్తున్నారన్నారు.