నందిగామలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. రైతు పేట వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్, మాజీ మంత్రి దేవినేని ఉమా కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.