కంచికచర్ల మండలం కీసర 65వ నేషనల్ హైవేపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం, గేదె అడ్డురావడంతో విజయవాడ వైపు వెళ్తున్న బైక్ వెనుక నుంచి వస్తున్న ఇసుక టిప్పర్ని ఢీకొట్టింది. ఘటనలో బైక్పై ఉన్న జ్యోతి (32)కి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. గాయాలైన మహిళ అనాసాగరానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.