నందిగామలో ఈనెల 1తేదీన జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. స్రవంతిని నరసింహారావు వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య చేశాడని ఏసీపీ తిలక్ శుక్రవారం మీడియాకు తెలిపారు. నిందితుడిని చందాపురం రోడ్డు వద్ద అదుపులోకి తీసుకొని, హత్యకు ఉపయోగించిన కత్తి, కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం ముద్దాయిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు.