నందిగామ నియోజకర్గం చందర్లపాడులో సాంఘీక సంక్షేమ బాలుర వసతి గృహం మూతపడి చుట్టు పక్కల గ్రామాల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, గత నెల 27వ తేదీ ఎమ్మెల్యే విద్యార్ధుల సంక్షేమం దృష్ట్యా వెంటనే స్పందిస్తూ, కలెక్టర్ కు లేఖ రాసి వెంటనే పునఃప్రారంభించాలని కోరారు. బుధవారం మండల కేంద్రం చందర్లపాడులో ఎస్సీ (బాలుర) వసతి గృహాన్ని ఎమ్మెల్యే స్థానిక నేతలతో కలసి పునఃప్రారంభించారు.