పెట్రోల్ బంకులో తహశీల్దార్ ఆకస్మిక తనిఖీలు

53చూసినవారు
పెట్రోల్ బంకులో తహశీల్దార్ ఆకస్మిక తనిఖీలు
వాహనదారులకు సొమ్ముకు తగిన పెట్రోల్ పోయడం లేదన్న ఫిర్యాదు మేరకు కంచికచర్లలోని భారత్ పెట్రోల్ బంకులో తహశీల్దార్ వేమూరి మానస శనివారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఒక లీటర్ డబ్బాలో పెట్రోలు పోయించి పరిశీలించారు. తూకాలలో తేడాలు, మీటర్లు సరిగా పనిచేయడం లేదని గుర్తించినట్లు తెలిపారు. పెట్రోల్ బంకులలో సేఫ్టీ సరిగా లేనట్లు తెలిసిందన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్