వీరులపాడు మండలం పరిధిలో ఇటీవల కురిసిన వర్షం, ఈదురు గాలుల కారణంగా సపోటా, మామిడి చెట్లు విరిగి నేలవాలాయని రైతు చేకూరి వేంకటాద్రి నాయుడు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలో సుమారు 250 ఎకరాల మామిడి, సపోటా తోటలు ఉన్నాయన్నారు. 2 నుంచి 3 టన్నుల వరకూ కాయలు రాలిపోతున్నాయన్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.