వీరులపాడు మండలం జుజ్జూరులో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రైతులకు గురువారం దాణా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నందిగామ పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మోజెస్ వెస్లీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో 40 మంది రైతులకు 50 కేజీల బస్తాలు ఒక్కొక్కరికి అందించడం జరిగిందని తెలిపారు. పాడి రైతులు ప్రభుత్వ అందిస్తున్న ప్రోత్సాహాలు అందిపుచ్చుకోవాలని తెలిపారు.