నందిగామ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తహసీల్దార్ సురేష్ బాబు ఆధ్వర్యంలో శనివారం యోగా ఆచార్యుడు గాడిపర్తి సీతారామారావు “యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రతిరోజూ యోగా చేయడం వల్ల క్రమశిక్షణతో కూడిన జీవనశైలి సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.